Sunday, 2 August 2026
  • Home  
  • హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతం చేయాలి: చంద్రశేఖర్ జీ
- ఖమ్మం

హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతం చేయాలి: చంద్రశేఖర్ జీ

హైదరాబాద్: ఆగష్టు (పున్నమి న్యూస్ ) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో “హర్ ఘర్ తిరంగా యాత్ర” నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ జీ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య శ్యాంసుందర్ నాయక్‌తో పాటు పలువురు బీజేపీ సహచర నాయకులు పాల్గొన్నారు. యాత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణపై చర్చించి పలు సూచనలు చేశారు.

హైదరాబాద్: ఆగష్టు
(పున్నమి న్యూస్ )

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో “హర్ ఘర్ తిరంగా యాత్ర” నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ జీ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య శ్యాంసుందర్ నాయక్‌తో పాటు పలువురు బీజేపీ సహచర నాయకులు పాల్గొన్నారు. యాత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణపై చర్చించి పలు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.