స్వార్థంతో నిండిపోయిన సమాజం..
సహాయం చేసిన వారినే మరచిపోతున్న కాలం..!
పున్నమి న్యూస్
మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
ప్రస్తుతం సమాజంలో మానవ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకునే సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన సమయంలో సహాయం చేసిన వారిని గుర్తించకపోవడం, అవసరం తీరిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని సామాజిక వేత్తలు చెబుతున్నారు.
“సూర్యుడు అస్తమించాడని ఏడవకు.. ఆ కన్నీళ్లలో ఆకాశంలోని నక్షత్రాలను కూడా చూడలేవు” అనే భావనతో జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పెద్దలు సూచిస్తున్నారు. కష్టకాలంలో మనకు తోడుగా నిలిచిన వ్యక్తుల విలువను గుర్తించడం, మానవ సంబంధాలను కాపాడుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సంబంధాలను కొనసాగించే ధోరణి పెరుగుతోందని, ఇది మానవత్వానికి ముప్పుగా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన జీవితంలో సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవడం, కృతజ్ఞతాభావంతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.



