నంద్యాల : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనివాస్ నగర్‌లోని వందే మార్ట్ (వి మార్ట్) ఆధ్వర్యంలో విజయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ వసుధ, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ మాధవి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో 40 మంది దాతలు రక్తదానం చేశారు. రక్తదాతలకు పండ్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు.కార్యక్రమంలో వందే మార్ట్ నిర్వాహకులు మల్లికార్జున రెడ్డి, రాఘవేంద్ర, భరత్ కుమార్ రెడ్డి, గణేష్ రెడ్డి తదితరులు, విజయ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం