
◆ వీరన్న కుటుంబాన్ని పరామర్శించి 5000/-రూపాయలు ఆర్ధిక సహాయం చేసిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు
రాజోలులో కురవి మండల పార్టీ మాజీ అధ్యక్షులు తోట లాలయ్య గారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు
కురవి, సెప్టెంబర్ 30: డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం హరిదాస్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని బాలు తండాకు చెందిన భూక్య వీరన్న గారు ఇటీవల మృతి చెందారు
● ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు నేడు వీరన్న గారి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం 5000/- ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు
● రాజోలు గ్రామానికి చెందిన పేరుంబుధుర్ నారాయణ స్వామి గారు ఇటీవల మరణించగా నేడు వారి నివాసానికి చేరుకొని నారాయణ స్వామి గారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు
● ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట లాలయ్య, స్థానిక సర్పంచ్ భూక్య శోభన్ బాబు, ఉప సర్పంచ్ ఇస్లావత్ రాజు, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బాణోత్ వీరన్న, మాజీ సర్పంచ్ యస్కె మస్తాన్, ఐలి నరహరి గౌడ్, బొడ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ భద్రు, కౌసల్యాదేవిపల్లి సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ధారావత్ వెంకన్న, భూక్య సంగ్య, సుందర్ లాల్, గోపాల్, వసంతరావు, సురేష్, రాంబాబు, రామ్మూర్తి,బస్వ వీరేశ్,సత్యనారాయణ, పాశం,వెంకన్న,పడాల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

