పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /కొవ్వూరు ఏప్రిల్ 30: గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొవ్వూరు మండలం ధర్మవరం స్వర్ణ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పోలిశెట్టి వర్షాంజలి 596 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. బెల్లపుకొండ నయన వెంకట సత్యశ్రీ 593, కట్టా వీర వెంకట సత్యనారాయణ 588, వేములీల వైష్ణవి 588, నామన జస్వంత్ వెంకట సాయిరాం 583, పోలిశెట్టి విజయదుర్గ 581 మార్కులు సాధించారు. మొత్తం 67 మంది విద్యార్థుల్లో 23 మంది 550కి పైగా, 48 మంది 500కి పైగా మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ పేరిచర్ల పద్మ, హెడ్‌మాస్టర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

స్వర్ణ భారతి స్కూల్ విద్యార్థుల సత్తా – 596 మార్కులతో వర్షాంజలి టాప్