Saturday, 5 September 2026
  • Home  
  • స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం: పద్మజ.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం: పద్మజ.

మండలంలోని పీ.ఎం.శ్రీ మోడల్ స్కూల్లో.నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్–జ్ఞానజ్యోతి 120 రోజుల అంగన్వాడీ కార్యకర్తల మండలస్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వింజమూరు సమగ్ర శిశు అభివృద్ధి సేవల ప్రాజెక్టు బాలల అభివృద్ధి పథకం అధికారిణి (సీడీపీవో) పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛత ప్రాధాన్యతను వివరించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్వచ్చత అనేది పాలకుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడటం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “పరిశుభ్రతే ప్రగతికి తొలిమెట్టు. స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మనందరి బాధ్యత” అని పేర్కొంటూ, స్వచ్ఛతపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలిగిరి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీను, పర్యవేక్షకురాలు విజయలక్ష్మి, జి మురళీకృష్ణ, డి. మీనా రెడ్డి(డీఆర్పీలు), అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మండలంలోని పీ.ఎం.శ్రీ మోడల్ స్కూల్లో.నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్–జ్ఞానజ్యోతి 120 రోజుల అంగన్వాడీ కార్యకర్తల మండలస్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వింజమూరు సమగ్ర శిశు అభివృద్ధి సేవల ప్రాజెక్టు బాలల అభివృద్ధి పథకం అధికారిణి (సీడీపీవో) పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛత ప్రాధాన్యతను వివరించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్వచ్చత అనేది పాలకుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడటం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “పరిశుభ్రతే ప్రగతికి తొలిమెట్టు. స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మనందరి బాధ్యత” అని పేర్కొంటూ, స్వచ్ఛతపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలిగిరి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీను, పర్యవేక్షకురాలు విజయలక్ష్మి, జి మురళీకృష్ణ, డి. మీనా రెడ్డి(డీఆర్పీలు), అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.