పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 18: వేముల మండల పరిధిలోని స్మార్ట్ కిచెన్‌ను ఎంపీడీఓ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది పరిసరాలు, వంట పరికరాలు, గ్యాస్ సదుపాయం, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
స్మార్ట్ కిచెన్‌ను పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.




