కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి – తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
నిర్మల్‌లో కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మల దహనం
నిర్మల్, మంగళవారం:
శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సయ్యద్ అర్జుమాంద్ ఆలీ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమేనని అన్నారు.
తక్షణమే కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, కౌన్సిలర్ చిన్ను, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు
కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి – తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి నిర్మల్‌లో కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మల దహనం నిర్మల్, మంగళవారం: శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సయ్యద్ అర్జుమాంద్ ఆలీ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమేనని అన్నారు. తక్షణమే కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, కౌన్సిలర్ చిన్ను, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

