Tuesday, 8 September 2026
  • Home  
  • పేదల కాలనీలపై వివక్ష వీడాలి: ఏనుగు సుదర్శన్ రెడ్డి ​ఎంఎస్‌ఆర్ కాలనీలో సమస్యలను పరిశీలించిన మేడ్చల్ బీజేపీ ఇన్‌చార్జ్ ​అధికారుల స్పందన.. రేపు ఉదయం డిప్యూటీ కమిషనర్ పర్యటన
- మేడ్చల్ – మల్కాజిగిరి

పేదల కాలనీలపై వివక్ష వీడాలి: ఏనుగు సుదర్శన్ రెడ్డి ​ఎంఎస్‌ఆర్ కాలనీలో సమస్యలను పరిశీలించిన మేడ్చల్ బీజేపీ ఇన్‌చార్జ్ ​అధికారుల స్పందన.. రేపు ఉదయం డిప్యూటీ కమిషనర్ పర్యటన

ఘట్కేసర్/పోచారం: పేద ప్రజలు నివసించే కాలనీలపై అధికారుల వివక్ష సరికాదని, వెంటనే అక్కడి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారపల్లిలోని ఎంఎస్‌ఆర్ కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన నేరుగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో ఎంఎస్‌ఆర్ కాలనీలో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా, ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే డ్రైనేజీ లీకేజీలు, చెత్త సేకరణ సరిగ్గా జరగకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ​అనంతరం ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. మంజూరైన సీసీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని, కాలనీలో పారిశుద్ధ్య లోపాలను అరికట్టాలని కోరారు. ​అధికారుల హామీ: కాలనీ సమస్యలపై సుదర్శన్ రెడ్డి మున్సిపల్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. రేపు (బుధవారం) ఉదయం డిప్యూటీ కమిషనర్ స్వయంగా కాలనీలో పర్యటించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఓబీసీ కార్యదర్శి పల్లె బిక్షపతి గౌడ్, అఖిల్, కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘట్కేసర్/పోచారం:
పేద ప్రజలు నివసించే కాలనీలపై అధికారుల వివక్ష సరికాదని, వెంటనే అక్కడి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారపల్లిలోని ఎంఎస్‌ఆర్ కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన నేరుగా పరిశీలించారు.
​ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో ఎంఎస్‌ఆర్ కాలనీలో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా, ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే డ్రైనేజీ లీకేజీలు, చెత్త సేకరణ సరిగ్గా జరగకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
​అనంతరం ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. మంజూరైన సీసీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని, కాలనీలో పారిశుద్ధ్య లోపాలను అరికట్టాలని కోరారు.
​అధికారుల హామీ:
కాలనీ సమస్యలపై సుదర్శన్ రెడ్డి మున్సిపల్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. రేపు (బుధవారం) ఉదయం డిప్యూటీ కమిషనర్ స్వయంగా కాలనీలో పర్యటించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఓబీసీ కార్యదర్శి పల్లె బిక్షపతి గౌడ్, అఖిల్, కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.