రాజమహేంద్రవరం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, టూ టౌన్ కు ఎదుట ఉన్న బీసీ హాస్టల్‌లో సౌత్ జోన్ శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై వివరించారు.
అదేవిధంగా సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరాన్ని తెలియజేస్తూ, మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. శక్తి యాప్ వినియోగంపై కూడా విద్యార్థినులకు ప్రదర్శన ఇచ్చి, అత్యవసర సమయాల్లో యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని, తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో భద్రతా చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.



