సోమశిల సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి
సోమశిల: సోమశిల జలాశయం పరిసర ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు కనిపిస్తే చాలు.. మట్టి, నిర్మాణ వ్యర్థాలను కుప్పలు కుప్పలుగా డంప్ చేస్తున్నారని స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగేవారు, పట్టించుకునే అధికారులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపిస్తున్నారు. సోమేశ్వరాలయం ముందు వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో 2013లో పర్యాటకులు పర్ణశాలలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో మట్టిదిబ్బలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. వివిధ అభివృద్ధి పనుల కోసం తొలగించిన మట్టిని ఇక్కడే పడేస్తున్నారని చెబుతున్నారు. దీంతో పర్యాటకులు బస చేసేందుకు, పరిసరాల్లో తిరిగేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వ్యర్థాల డంపింగ్‌ను అరికట్టి, ప్రాంతాన్ని శుభ్రం చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.


