Tuesday, 15 September 2026
  • Home  
  • పెన్షన్ల నమోదు గడువు పొడిగించాలి.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెన్షన్ల నమోదు గడువు పొడిగించాలి.

నెల్లూరు సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి ) నెల్లూరు: (ఎన్ టీ ఆర్ )భరోసా పెన్షన్ల నమోదుకు గడువును వచ్చే నెల 25 వరకు పొడిగించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కేవలం తొమ్మిది రోజులే గడువు ఇవ్వడంతో అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని నాయకులు తెలిపారు. సర్వర్లు పనిచేయకపోవడం, సెలవు దినాలతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రీ-అసెస్మెంట్ చేసిన 60 శాతానికి పైగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందక పెన్షన్ల నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించిన జాయింట్ కలెక్టర్ గడువు పొడిగించాలని కోరుతూ (ఎస్ ఈ ఆర్ పి) కార్యాలయానికి ఫ్యాక్స్ పంపారు. కార్యక్రమంలో ఎ.మునిశేఖర్ రెడ్డి, సామ్యూల్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి )

నెల్లూరు: (ఎన్ టీ ఆర్ )భరోసా పెన్షన్ల నమోదుకు గడువును వచ్చే నెల 25 వరకు పొడిగించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కేవలం తొమ్మిది రోజులే గడువు ఇవ్వడంతో అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని నాయకులు తెలిపారు. సర్వర్లు పనిచేయకపోవడం, సెలవు దినాలతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రీ-అసెస్మెంట్ చేసిన 60 శాతానికి పైగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందక పెన్షన్ల నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించిన జాయింట్ కలెక్టర్ గడువు పొడిగించాలని కోరుతూ (ఎస్ ఈ ఆర్ పి)
కార్యాలయానికి ఫ్యాక్స్ పంపారు. కార్యక్రమంలో ఎ.మునిశేఖర్ రెడ్డి, సామ్యూల్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.