జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూన్ పున్నమి)
సీమ లిఫ్ట్ కోసం ప్రాణాలర్పించేందుకు కూడా వెనుకాడబోమని రైతులకు న్యాయం జరిగేంత వరకు రాజీ లేని పోరు చేపడుతామని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “చలో సోమశిల” కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మేక పాటి విక్రమ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి , రైతులు, ప్రజలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి సోమశిల ప్రాజెక్టును కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.నెల్లూరు నుండి సోమశిలకు సుమారు 200 కార్లతో, కలువాయి జాతీయ రహదారి నుండి 300 బైకులతో భారీ ర్యాలీగా వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక నేతలు స్వాగతం పలికారు. చలో సోమశిల సందర్శనకు పోలీసులు ఆటంకం కలిగిస్తూ,సోమశిల ప్రాజెక్టు గేట్లు మూసివేసి వైఎస్ఆర్ సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసుల తీరుపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.భారీగా జనం రావడంతో, పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా, రైతులతో కలిసి సోమశిల ప్రాజెక్టు ను సందర్శించిన అనంతరం కాకాణి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయం లో రైతులతో కలిసి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.



