శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జిగా సేవలందించిన జి. బేబీ రాణి చీరాలకు బదిలీ అయిన సందర్భంగా, సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెను దుశ్శాలువతో కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆరంభాకం ముని ప్రసాద్ మాట్లాడుతూ.. న్యాయమూర్తి బేబీ రాణి ఇక్కడ పనిచేసిన కాలంలో న్యాయవాదులతో ఎంతో సమన్వయంతో ఉంటూ, కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఆమె నిబద్ధత, న్యాయ పాలన పట్ల ఉన్న మక్కువ అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తన బదిలీ సందర్భంగా న్యాయవాదులు చూపిన ప్రేమాభిమానాలకు జడ్జి బేబీ రాణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో కన్నాలి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఈ. ప్రభాకర్ రెడ్డి, ఉదయనాథ్, పొన్నెపల్లి వెంకటాద్రి, అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణిని ఘనంగా సన్మాననించిన -శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్