రాష్ట్రంలోని సి.వి.ఐ.పి యూనిట్లు, పి4 కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వర్చువల్‌గా సమీక్షించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, కమిషనర్ వై.ఓ. నందన్ సమావేశంలో పాల్గొని కె.పి.ఐ పురోగతి, పి4 అమలు, పి.జీ.ఆర్.ఎస్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారాన్ని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు










