సింధు నది వ్యవస్థలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద గరిష్ఠ నీటి నిల్వపై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థగా భారత్ గుర్తించదని విదేశాంగ శాఖ తెలిపింది. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఈ తీర్పు చెల్లదని పేర్కొంది. పాకిస్థాన్ అభ్యర్థనపై 2023లో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ప్యానెల్ ఈ నిర్ణయం ఇచ్చింది. కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టులపై భారత్ వాదనను కొనసాగిస్తూ, నీటి నిల్వ లెక్కింపుపై తీర్పు భారత ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది.

సింధు జలాల తీర్పు తిరస్కరణ — భారత్