సమాచార హక్కు చట్ట కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన RTI ప్రతినిధులు
హైదరాబాద్:
సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సయ్యద్ హైదర్ గారు ఈరోజు రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ శ్రీ P. V.శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సమాచార హక్కు కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కమిటీ ప్రతినిధులు కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ హైదర్ గారితో పాటు కమిటీ ప్రతినిధి శ్రీ అబ్దుల్ సాదిక్ గారు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు సమాచార హక్కు చట్టం ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందేలా చూడటం మరియు చట్ట పరిరక్షణకు కమిటీ తరఫున తగిన సహకారం అందించడంపై కమిషనర్ గారితో చర్చించారు. ప్రజలకు చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు ఉమ్మడిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.


