ఖమ్మం: సంత్ గురు రవిదాస్ జీ మహారాజ్ సమరసత సంకల్ప అభియాన్‌లో భాగంగా ఆయన జన్మస్థలం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలశాలను పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా రాష్ట్రాలకు కలశాల పంపిణీ జరిగింది. జిల్లాల వారీగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్, గువ్వల బాలరాజు చేతుల మీదుగా ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్‌కు కలశాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగా పురం కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సమరసత, సామాజిక ఐక్యత, సంత్ రవిదాస్ మహారాజ్ ఆశయాల ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.



