ఘటనా స్థలాన్ని పరిశీలించిన శంకర్ రెడ్డి గారు, మృతుడి కుటుంబ సభ్యులకు తన తీవ్ర సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరపున మరియు పార్టీ తరపున ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా క్వారీ కుంటలో పడిపోయిన సుకుమార్ మృతదేహాన్ని వెలికితీసేందుకు శ్రమించిన పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు, సిబ్బందికి శంకర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు



