Friday, 10 July 2026
  • Home  
  • సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
- తిరుపతి

సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో రెండు, మూడు వార్డు సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు, ధృవీకరణ ప్రక్రియలను తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో సమావేశమై, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో కచ్చితంగా సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పారదర్శకత, బాధ్యతాయుత సేవా దృక్పథంతో ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజా సేవే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేసి, ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.