నెల్లూరు జిల్లా కుల్లూరు మెయిన్ స్కూల్‌లో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్, ఆట సామాగ్రిని పంపిణీ చేశారు. కుల్లూరు మెయిన్ స్కూల్‌లోని 47 మంది విద్యార్థులకు, హరిజనవాడ స్కూల్‌లోని 62 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేయడంతో పాటు రెండు పాఠశాలల్లో విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన ఆట సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డోనర్ సురేందర్ రెడ్డి, శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుధాకర్‌తో పాటు సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమాజంలో మంచి పౌరులుగా ఎలా మెలగాలి, తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను ఆదరించడం, దైవభక్తితో ముందుకు సాగడం వంటి విషయాలను వివరించారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే విలువలను జీవితంలో పాటిస్తూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
Uploaded Video:

