ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వెంకయ్య స్వామికి అభిషేకాలు, నూతన పట్టు వస్త్రాల సమర్పణ, విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం చేపట్టారు. ఉభయకర్తలుగా యరాసి శివమ్మ, ఉడత మంజుల, కయ్యూరు సుమతి, కండ్రాతి రాజేశ్వరి, గోపిరెడ్డి నిర్మలమ్మ వ్యవహరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో ఘనంగా శనివారం ప్రత్యేక పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వెంకయ్య స్వామికి అభిషేకాలు, నూతన పట్టు వస్త్రాల సమర్పణ, విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం చేపట్టారు. ఉభయకర్తలుగా యరాసి శివమ్మ, ఉడత మంజుల, కయ్యూరు సుమతి, కండ్రాతి రాజేశ్వరి, గోపిరెడ్డి నిర్మలమ్మ వ్యవహరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

