Friday, 24 April 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో విషాదం-నిమ్మచెట్టుకు వేలాడుతూ వ్యక్తి ఆత్మహత్య
- తిరుపతి

శ్రీకాళహస్తిలో విషాదం-నిమ్మచెట్టుకు వేలాడుతూ వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర కలకలం రేగింది. స్థానిక సుఖ బ్రహ్మాశ్రమం సమీపంలోని తుపాన్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి నిమ్మచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటన వివరాల్లోకి వెళితే.. తుపాన్ సెంటర్ ప్రాంతంలో నివసించే స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున తమ దైనందిన పనుల కోసం బయటకు రాగా, అక్కడ ఉన్న ఒక నిమ్మచెట్టుకు వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురయ్యారు. తక్షణమే వారు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో ప్రస్తుతం అతని వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనసంచారం ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.