శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన యువతి మల్లం చందు అరుదైన ఘనత సాధించి పుట్టినింటికి గర్వకారణంగా నిలిచారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక ‘స్విమ్స్’ (SVIMS) యూనివర్సిటీ నిర్వహించిన 14వ ఘటికోత్సవంలో ఆమె ఫిజియోథెరపీ పీజీ విభాగంలో బంగారు పతకాన్ని (Gold Medal) అందుకున్నారు. శ్రీకాళహస్తిలోని విక్రమ్ జూనియర్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా సేవలందిస్తున్న మల్లం సుధాకర్ కుమార్తె అయిన చందు, మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తున్నారు. ఫిజియోథెరపీ కోర్సులో అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను యూనివర్సిటీ అధికారులు ఆమెను గోల్డ్ మెడల్తో సత్కరించారు. ఈ వేడుకలో యూనివర్సిటీ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె పతకాన్ని అందుకున్నప్పుడు సభికుల కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారుమోగిపోయింది. తమ కుమార్తె సాధించిన ఈ విజయం పట్ల తండ్రి సుధాకర్, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చందు ప్రతిభను గుర్తించిన శ్రీకాళహస్తి ప్రముఖులు, విద్యావేత్తలు, పట్టణ ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో వైద్య రంగంలో మరిన్ని సేవలు అందిస్తూ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

శ్రీకాళహస్తి ఆణిముత్యం-ఫిజియోథెరపీలో చందు ‘బంగారు’ విజయం