శ్రీకాళహస్తి, మే 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి భారీ దొంగతనం చోటుచేసుకుంది. స్థానిక నివాసి భక్తవత్సల రెడ్డి కుటుంబ సమేతంగా ముసలిపేడు సమీపంలోని బత్తినయ్య కోనకు దైవ దర్శనానికి వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. అనంతరం బీరువాలను పరిశీలించగా సుమారు 10 సవర్ల బంగారు నగలు, రూ.2.45 లక్షల నగదు దొంగిలించబడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వన్ టౌన్ ఎస్.ఐ. సుబ్బారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సందర్భంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సాధ్యమైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో గస్తీ పెంచి భద్రత కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.

శ్రీకాళహస్తిలో భారీగా చోరి-10 సవర్ల బంగారం, నగదు అపహరణ