Tuesday, 19 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో నేడు మెడికల్ షాపుల బంద్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో నేడు మెడికల్ షాపుల బంద్

శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): ప్రజల ఆరోగ్య హక్కులు, వైద్య రంగ సమస్యల పరిష్కారం కోసం మే 20 బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి వైద్య దుకాణాల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ బంద్‌కు పట్టణ ప్రజలు, మేధావులు పూర్తి సహకారం అందించాలని సంఘ ప్రతినిధులు కోరారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వారు స్పష్టం చేశారు. సాధారణ అవసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు తమ మందులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య భద్రత, వైద్య సేవల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలందరూ సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.