శ్రీ కాళహస్తి, జూన్ 20, (పున్నమి న్యూస్) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, దశరథాచారి, కుప్పా ప్రసాద్, మిన్నల్ రవి, ఉమేష్ యాదవ్, వజ్రం కిషోర్, జనసేన నాయకులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కోలా ఆనంద్‌ను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అభిమానులు, ప్రజలు విశేషంగా పాల్గొనడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కోలా ఆనంద్ ప్రజాసేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.

శ్రీకాళహస్తిలో కోలా ఆనంద్ జన్మదిన వేడుకలు ఘనం