Wednesday, 16 September 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో అన్నదాత డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జనసైనికులు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో అన్నదాత డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జనసైనికులు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 20, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా 91వ వారానికి చేరుకుంది. నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ అన్నదానంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు స్వయంగా పాల్గొని పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రముఖ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, డాక్టర్ నక్కా ప్రసాద్‌లతో పాటు తేజ, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్, చందు, ముని చంద్ర, లక్ష్మీపతి, జానీ, రాజా పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ తదితర వీర మహిళలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తూ, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మున్ముందు కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.