Saturday, 18 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం-డాలర్స్ దివాకర్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

శ్రీకాళహస్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం-డాలర్స్ దివాకర్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 17, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంయుక్తంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల వసతులపై ప్రధానంగా చర్చిస్తూ, ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ప్రైవేట్ వసతులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, భక్తులందరూ దేవస్థాన కాటేజీల్లోనే బస చేసేలా కనీసం 25 నుండి 30 ఎకరాల్లో భారీ కాటేజ్ సముదాయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తిరుమల తరహాలో సిల్వర్, గోల్డ్, డైమండ్ కేటగిరీల్లో నిర్మించే ఈ గదుల ద్వారా స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నేతలు పేర్కొన్నారు. భక్తులకు నేరుగా కనెక్టివిటీ కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్లను రూపొందిస్తున్నట్లు వెల్లడిస్తూ.. తొండమానాడు నుండి 40/60 అడుగుల రోడ్డు నిర్మించి, లోబాయి వద్ద భారీ వంతెన ద్వారా చెన్నై హైవేకి నేరుగా అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తిరుచానూరు, వకుళమాత ఆలయాల తరహాలో రోడ్ల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, తమిళనాడు తిరువణ్ణామలై తరహాలో భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు అధునాతన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని డాలర్స్ దివాకర్ రెడ్డి సూచించారు. పుణ్యనది స్వర్ణముఖిలోకి పట్టణ కలుషిత నీరు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, స్వర్ణముఖిపై నిర్మించే వంతెనను కింద చెక్ డ్యామ్, పైన రహదారిగా రెండు రకాలుగా ఉపయోగపడేలా ఇరిగేషన్ శాఖ సమన్వయంతో ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం నాణ్యమైన వెజిటేరియన్ హోటల్స్‌ను అందుబాటులోకి తేవాలని, విరాళాలు ఇచ్చే డోనార్లకు ఆలయ ఆర్జిత సేవల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు దేవస్థాన బోర్డుతో చర్చిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం ఆర్డీఓ, ఎమ్మార్వో, రెవెన్యూ, తుడా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి తడ-చెన్నై కనెక్టివిటీని వేగవంతం చేయాలని, భూసేకరణ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, దేవస్థాన ఈవో వెంకటేశ్వర్లు, తుడా ఛైర్మన్ కొట్టే సాయి, తుడా సెక్రటరీ డా|| ఎన్.వి. శ్రీకాంత్ బాబు, సీపిఓ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజనతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, తుడా అధికారులు పాల్గొన్నారు. ఈ బృహత్తర ప్రణాళికల ద్వారా శ్రీకాళహస్తి రూపురేఖలు మారి, భక్తులకు అత్యుత్తమ దైవదర్శన అనుభూతి కలుగుతుందని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.