Friday, 10 July 2026
  • Home  
  • శివాలయంలో సామూహిక అక్షరాభ్యాసం-చిన్నారులకు ఓనమాలు దిద్దించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

శివాలయంలో సామూహిక అక్షరాభ్యాసం-చిన్నారులకు ఓనమాలు దిద్దించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో గురువారం ఉదయం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్వయంగా చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని, బంగారు కడ్డీతో బియ్యంపై ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. పవిత్రమైన గురు దక్షిణామూర్తి సన్నిధిలో చిన్నారులకు తొలిసారి అక్షర రూపం నేర్పించే భాగ్యం కలగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యా స్వరూపుడైన ఆ పరమశివుని ఆశీస్సులతో నియోజకవర్గంలోని పిల్లలందరూ చదువుల్లో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి బిడ్డ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.