Monday, 25 May 2026
  • Home  
  • శాప్ చైర్మన్‌కు ఎమ్మెల్యే బొజ్జల ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుపతి

శాప్ చైర్మన్‌కు ఎమ్మెల్యే బొజ్జల ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలోని శాప్ చైర్మన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రవినాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో రవినాయుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. రవినాయుడు నిరంతరం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.