వేసవి నీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి : అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు
వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా నీటి ఎద్దడి ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోర్లు మరమ్మతులు, పైప్‌లైన్ లీకేజీల నివారణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వేసవి నీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి : అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు
వేసవి నీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి : అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా నీటి ఎద్దడి ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోర్లు మరమ్మతులు, పైప్‌లైన్ లీకేజీల నివారణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

