విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 9 ::
“నిజం గెలిచింది.. ధర్మం గెలిచింది” అంటూ ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. భీమిలి నియోజకవర్గం ఐటీడీపీ ఉపాధ్యక్షులు కాకర సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మూడేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు నిర్బంధానికి గురైన ఘటనను గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు 53 రోజుల పాటు అండగా నిలిచిన విషయాన్ని టీడీపీ శ్రేణులు స్మరించుకున్నారు.
చంద్రబాబు విడుదల అనంతరం ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేసుకుంటూ నాటి పరిస్థితులను స్మరించుకున్నారు.
కొవ్వొత్తుల వెలుగుల్లో “నిజం గెలిచింది.. ధర్మం గెలిచింది” అంటూ నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


