Monday, 14 September 2026
  • Home  
  • వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభను విజయవంతం చేద్దాం – కాకర్ల సురేష్ పిలుపు, వెలుగొండ చరిత్రను చాటేలా… ముస్తాబైన ప్రత్యేక రథాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభను విజయవంతం చేద్దాం – కాకర్ల సురేష్ పిలుపు, వెలుగొండ చరిత్రను చాటేలా… ముస్తాబైన ప్రత్యేక రథాలు

కలిగిరి, పున్నమి ప్రతినిధి , 30-08-2026 ప్రకాశం–నెల్లూరు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రతిష్టాత్మక వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేసేందుకు ఉదయగిరి నియోజకవర్గం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమవారం, ఆగస్టు 31న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేక సందడి నెలకొంది. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, ఎనిమిది మండలాల కన్వీనర్లు, మాజీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో చారిత్రాత్మక వెలుగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక రథాలను అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు చరిత్ర, ప్రాజెక్టు నిర్మాణం, రైతాంగానికి చేకూరనున్న ప్రయోజనాలను ప్రతిబింబించే విధంగా రథాలను ప్రత్యేకంగా అలంకరించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ రథాలు ప్రారంభోత్సవ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీటి లభ్యత మరింత మెరుగుపడి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరనుందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సభా ప్రాంగణానికి తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. 📍 ఉదయం 6.00 గంటలకు – దుత్తలూరు సెంటర్ 📍 ఉదయం 6.30 గంటలకు – పామూరు సెంటర్ నుంచి ప్రత్యేకంగా ముస్తాబు చేసిన రథాలతో పాటు కూటమి శ్రేణులు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభకు బయలుదేరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Uploaded Video:

కలిగిరి, పున్నమి ప్రతినిధి , 30-08-2026
ప్రకాశం–నెల్లూరు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రతిష్టాత్మక వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేసేందుకు ఉదయగిరి నియోజకవర్గం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమవారం, ఆగస్టు 31న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేక సందడి నెలకొంది. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, ఎనిమిది మండలాల కన్వీనర్లు, మాజీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో చారిత్రాత్మక వెలుగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక రథాలను అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు చరిత్ర, ప్రాజెక్టు నిర్మాణం, రైతాంగానికి చేకూరనున్న ప్రయోజనాలను ప్రతిబింబించే విధంగా రథాలను ప్రత్యేకంగా అలంకరించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ రథాలు ప్రారంభోత్సవ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యాయి.
వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీటి లభ్యత మరింత మెరుగుపడి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరనుందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సభా ప్రాంగణానికి తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. 📍 ఉదయం 6.00 గంటలకు – దుత్తలూరు సెంటర్ 📍 ఉదయం 6.30 గంటలకు – పామూరు సెంటర్ నుంచి ప్రత్యేకంగా ముస్తాబు చేసిన రథాలతో పాటు కూటమి శ్రేణులు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభకు బయలుదేరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.