రైతన్నా..! ఓ రైతన్న..!
ఇది రామ రాజ్యం అనుకుంటే…!
రాళ్ల దెబ్బలు తింటివే…!
చేతికి అందిన పంటలు,
గంగ గర్భంలో కలిసినే..!
రైతుకు అందె స్కీములు,
స్కాములు గానే మిగిలేరా..!
రైతు నుదిటి రాతను,
ఆ బ్రహ్మ కూడా మార్చలే కదరా..!
పుస్తెలమ్మి పెట్టినావు, ప్రాణం కన్నా మిన్నగా చూసినావు,
పైరు చేతి కొచ్చే నాటికి
నాయనా…!నీ గుండె పగిలినే కదరా…,!
-కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు,DSR హై స్కూల్, అల్లూరు )

