వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని సంబాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంకు చెందిన శ్రీమతి మాధవి ప్రత్యేకంగా ఊలుతో అల్లిన జాతీయ జెండాను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. జాతీయ జెండాను స్వయంగా ఊలుతో అల్లిన మాధవి ప్రతిభను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.



