Friday, 11 September 2026
  • Home  
  • వినాయక చవితికి మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టిన జనసేన పార్టీ నాయకులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వినాయక చవితికి మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టిన జనసేన పార్టీ నాయకులు

ప్రకృతిని ప్రేమిద్దాం మట్టి వినాయకుడిని పూజిద్దాం అంటూ పర్యావరణ ప్రేమికులు తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆ క్రమంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అన్నందేవర మురళి మరియు విత్తనాల రవితేజ వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత, సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుదాం, భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం అంటూ వారు చేపట్టిన వినూత్న కార్యక్రమానికి పలువురు ప్రశంసలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అన్నందేవర మురళి మరియు విత్తనాల రవితేజ మాట్లాడుతూ మట్టి వినాయకుడు, ప్రకృతికి రక్షణ,మన భావితరాల భవిష్యత్తుకు భరోసా అనే భావనతో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని 300 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

ప్రకృతిని ప్రేమిద్దాం మట్టి వినాయకుడిని పూజిద్దాం అంటూ పర్యావరణ ప్రేమికులు తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆ క్రమంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు
అన్నందేవర మురళి మరియు విత్తనాల రవితేజ వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత,
సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుదాం,
భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం అంటూ వారు చేపట్టిన వినూత్న కార్యక్రమానికి పలువురు ప్రశంసలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అన్నందేవర మురళి మరియు విత్తనాల రవితేజ మాట్లాడుతూ మట్టి వినాయకుడు, ప్రకృతికి రక్షణ,మన భావితరాల భవిష్యత్తుకు భరోసా అనే భావనతో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని 300 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.