నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించి క్షేత్రస్థాయి ప్రజల వరకు సంక్షేమం అందేలా బాధ్యత వహించాలని కమిషనర్ హరిత సూచించారు. స్థానిక 1, 2, 9 డివిజనుల్లోని ద్వారకా నగర్, విశ్వ హాస్పిటల్, కుసుమ హరిజనవాడ సచివాలయాలను కమిషనర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సంక్షేమ పథకాల అమలు రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించి, సచివాలయం పరిధిలోని గృహాలు, కమర్షియల్ భవనాలన్నింటికీ చెత్త సేకరణ బిన్స్ పంపిణీ చేసారా అని విచారించారు. కమర్షియల్ ఆస్థి పన్నులతో పాటు, ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సచివాలయం కార్యదర్శులకు ఆదేశించారు. కార్యదర్శులంతా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ప్రతిరోజూ తప్పక ధరించాలని కమిషనర్ సూచించారు.
పట్ల నిబద్ధతతో వ్యవహరించండి
– కమిషనర్ హరిత