Monday, 17 August 2026
  • Home  
  • విద్యుత్ షాక్‌తో కార్మికుడికి బ్రెయిన్ డెడ్..
- BHADRADRI

విద్యుత్ షాక్‌తో కార్మికుడికి బ్రెయిన్ డెడ్..

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు,16, (పున్నమి ప్రతినిధి) కొత్తగూడెం కార్పొరేషన్‌లో వీధిలైట్లు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైన కార్మికుడు భూక్యా జయరాం ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండి, బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న జయరాం పరిస్థితిని ఈ దృశ్యం తెలియజేస్తోంది. కార్పొరేషన్‌లో జయరాంకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోవడం, మెరుగైన వైద్యం అందకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులు కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి, జయరాం కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు,16, (పున్నమి ప్రతినిధి)

కొత్తగూడెం కార్పొరేషన్‌లో వీధిలైట్లు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైన కార్మికుడు భూక్యా జయరాం ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండి, బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న జయరాం పరిస్థితిని ఈ దృశ్యం తెలియజేస్తోంది. కార్పొరేషన్‌లో జయరాంకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోవడం, మెరుగైన వైద్యం అందకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులు కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి, జయరాం కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.