Sunday, 16 August 2026
  • Home  
  • భాగవత సప్తాహంలో పాల్గొన్న తులసి రెడ్డి.
- కడప

భాగవత సప్తాహంలో పాల్గొన్న తులసి రెడ్డి.

పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం, మడూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు 16 -08-26 ఆదివారం నుండి 22 -08-26 శనివారం వరకు మడూరు గ్రామ ప్రజలు,భక్తాదుల చేత భాగవత సప్తాహ శ్రవణ యజ్ఞము ఏర్పాటు చేయడమైనది. తొలి రోజు ఆదివారం రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు, భాగవత సప్తాహం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు,ఆధ్యాత్మికవేత్తలు, భాగవతులతో సమాలోచనలు ఆధునిక మానవునికి ప్రశాంతిని కలిగిస్తాయన్నారు.మన పురాణ ఇతిహాసాలు సమాజానికి నిత్య దిక్సూచికలు. రామాయణం ఒక ఆదర్శ శాస్త్రం.మహాభారతం ధర్మార్థ కామ మోక్షాలను వివరించే ధర్మశాస్త్రం. భాగవతం ఒక మోక్ష శాస్త్రం. శ్రీమన్నారాయణు ని దశావతారాల వర్ణనా వైభవమే మహాభాగవతం.ప్రహ్లాదుడు, దృవుడు ముచి కుందుడు, అంబరీషుడు,కుచేలుడు, గజేంద్రుడు తదితర భాగవతోత్తముల గాధల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే మోక్షశాస్త్రం భాగవతం అన్నారు.భాగవతాన్ని భక్తిశ్రద్ధలతో పటించినా,ఆలకించినా మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.కలియుగ ఆరంభంలో గంగా నది తీరాన శుక మహర్షి అధ్యక్షతన పరీక్షిత్తు మహారాజు మొట్టమొదటిసారి భాగవత సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించారని, దీనివల్ల పరీక్షిత్తుకు మోక్ష ప్రాప్తి లభించిందని ప్రతీతి. అటువంటి మంచి కార్యక్రమాన్ని మడూరు గ్రామంలో నిర్వహించడం చాలా అభినందనీయమని తులసి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తేరా పుల్లారెడ్డి, మీడియా ఇంచార్జ్ యాగంటి బాలకృష్ణారెడ్డి,భాగవతులు పెద్దరామయ్య,విజయ శంకర్, వెంకట శేషయ్య, విజయ్ గోపాల్, నవమోహన్,కృష్ణారెడ్డి, కొండయ్య,అమర్నాథ్ రెడ్డి,ఉత్తన్న, ఐచర్ రమణ,చిన్నకోట్ల నాగరాజు,పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.