తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఉద్యమించాలని SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ పిలుపునిచ్చారు.
SFI వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – వాస్తవాలు, వక్రీకరణలు” అంశంపై జిల్లా కార్యదర్శి పైసా గణేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెర కిరణ్ మాట్లాడుతూ… భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాట స్ఫూర్తి నేటికీ అవసరమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఐక్యంగా పోరాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో SFI నాయకులు సాయి, మోహన్, పల్లవి, లావణ్య, సంతోష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి: SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఉద్యమించాలని SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ పిలుపునిచ్చారు. SFI వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – వాస్తవాలు, వక్రీకరణలు” అంశంపై జిల్లా కార్యదర్శి పైసా గణేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెర కిరణ్ మాట్లాడుతూ… భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాట స్ఫూర్తి నేటికీ అవసరమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు సాయి, మోహన్, పల్లవి, లావణ్య, సంతోష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

