Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కలెక్టర్ చేతులమీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ ప్రతి అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలెక్టర్ చేతులమీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ ప్రతి అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: తిరుపతి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం నాడు కార్యవర్గ ప్రతిని చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ లకు…
  • ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
  • త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ సమావేశం ఏర్పాటు చేసి పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: తిరుపతి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం నాడు కార్యవర్గ ప్రతిని చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ లకు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ సమావేశం ఏర్పాటు చేసి పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీహరి, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ ఇరువురు మాట్లాడుతూ.. కలెక్టర్ సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మిగిలిన ప్రతీ పని పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *