ఖమ్మం నగరం లోని బాలాజీనగర్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు మద్యం సేవించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు వాటర్ బాటిళ్లలో మద్యం తీసుకొచ్చి తాగినట్లు ప్రచారం జరగడంతో విషయం కలకలంగా మారింది. ఈ ఘటనపై సోమవారం విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. అధికారులు చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



