Sunday, 13 September 2026
  • Home  
  • విద్యాబోధనలో నాణ్యతే లక్ష్యం మనుబోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యాబోధనలో నాణ్యతే లక్ష్యం మనుబోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం గూడూరు డిప్యూటీ డీఈఓ డి. సనత్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని డిప్యూటీ డీఈఓ తెలిపారు. లోపాలను వెంటనే సరిచేసుకోవాలని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎంఈఓ హజరత్తయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సభ్యులు ముత్త సుల్తానా, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం గూడూరు డిప్యూటీ డీఈఓ డి. సనత్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని డిప్యూటీ డీఈఓ తెలిపారు. లోపాలను వెంటనే సరిచేసుకోవాలని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎంఈఓ హజరత్తయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సభ్యులు ముత్త సుల్తానా, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.