విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతిఒక్కరు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని దీనికి తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని మిత్ర ఫౌండేషన్ చైర్మన్ షేక్. షబ్బీర్ భరోసానిచ్చారు. గూడూరులోని విందూరు మిత్ర ఎస్టీ కాలనిలో 5వ తేది సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదవారి బిడ్డల చదువు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని అయిన కొంతమంది ఏవో కారణాలతో డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని ఆవేదన చెందారు. అలాంటి వారికోసం తమ సంస్థ అన్నిరకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్బంగా అక్కడి పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పలకలు, ఛార్ట్స్, పరీక్షలకు అవసరమగు మెటీరియల్స్ తదితర సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదవాలని, అలాగే ఎవరైనా క్రీడాకారులు వుంటే వారిని గుర్తించి తగిన క్రీడా వస్తుసామాగ్రిని అందిస్తామని షబ్బీర్ పేర్కొన్నారు. ఆరోగ్య విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షబ్బీర్ ఉపదేశిస్తూ విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విందూరు మిత్ర ST కాలనీలో నివసిస్తున్న 30 కుటుంబాలకు మరియు చిన్న పిల్లలకు బ్రెడ్, పాలు, పాయసం, ఆపిల్ పండ్లుతో పాటు మరికొన్ని వస్తువులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని ప్రజలతోపాటు షేక్.అబ్దుల్లా, జాఫర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.