Wednesday, 9 September 2026
  • Home  
  • విత్త సఖీలు మహిళా వ్యాపారవేత్తలకు స్థిరమైన ఆదాయ మార్గాలు చూపాలి – జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయ
- కడప

విత్త సఖీలు మహిళా వ్యాపారవేత్తలకు స్థిరమైన ఆదాయ మార్గాలు చూపాలి – జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయ

పున్నమి న్యూస్ ప్రతినిధి: పులివెందుల పులివెందుల, సెప్టెంబర్ 09: మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించి, వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించే వ్యాపార, జీవనోపాధి అవకాశాలను గుర్తించి కల్పించడంలో విత్త సఖీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయ సూచించారు. పులివెందుల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న విత్త సఖీల శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ప్రతి విత్త సఖీకి కేటాయించిన 50 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్‌లో బిజినెస్ ప్లాన్ రూపొందించి, వారి ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలను చూపాలని ధనుంజయ సూచించారు. వేముల వెలుగు–DRDA అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ, మహిళా వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం కల్పించేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీ విధానంపై శిక్షణ ఇచ్చారు. వ్యాపార ఆదాయ–వ్యయాలు, ఆస్తులు, బాధ్యతలు తదితర వివరాలను ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేసి బ్యాంకులకు సమర్పించే విధానాన్ని వివరించారు. ఐటీ యాంకర్ పర్సన్ నాగేంద్ర రెడ్డి లోకోస్ యాప్‌లో బ్లాక్ క్యాడర్ లాగిన్, రోల్ అసైన్‌మెంట్, బిజినెస్ ప్లాన్ సమర్పణపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. SVEP బ్లాక్ మేనేజర్ వెంకటస్వామి మహిళలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వైపు ప్రోత్సహించాలని సూచించారు. DMGలు గంగరాజు, సుబ్బారెడ్డి వ్యాపార లావాదేవీల నమోదు, పుస్తకాల నిర్వహణ, ఆర్థిక నివేదికలను ఆన్‌లైన్‌లో బ్యాంకులకు సమర్పించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో DMG నాగార్జున, మండల సమాఖ్య ప్రతినిధులు, పులివెందుల డివిజన్ పరిధిలోని విత్త సఖీలు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి: పులివెందుల
పులివెందుల, సెప్టెంబర్ 09:
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించి, వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించే వ్యాపార, జీవనోపాధి అవకాశాలను గుర్తించి కల్పించడంలో విత్త సఖీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయ సూచించారు. పులివెందుల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న విత్త సఖీల శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది.

ప్రతి విత్త సఖీకి కేటాయించిన 50 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్‌లో బిజినెస్ ప్లాన్ రూపొందించి, వారి ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలను చూపాలని ధనుంజయ సూచించారు.

వేముల వెలుగు–DRDA అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ, మహిళా వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం కల్పించేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీ విధానంపై శిక్షణ ఇచ్చారు. వ్యాపార ఆదాయ–వ్యయాలు, ఆస్తులు, బాధ్యతలు తదితర వివరాలను ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేసి బ్యాంకులకు సమర్పించే విధానాన్ని వివరించారు.

ఐటీ యాంకర్ పర్సన్ నాగేంద్ర రెడ్డి లోకోస్ యాప్‌లో బ్లాక్ క్యాడర్ లాగిన్, రోల్ అసైన్‌మెంట్, బిజినెస్ ప్లాన్ సమర్పణపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. SVEP బ్లాక్ మేనేజర్ వెంకటస్వామి మహిళలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వైపు ప్రోత్సహించాలని సూచించారు.

DMGలు గంగరాజు, సుబ్బారెడ్డి వ్యాపార లావాదేవీల నమోదు, పుస్తకాల నిర్వహణ, ఆర్థిక నివేదికలను ఆన్‌లైన్‌లో బ్యాంకులకు సమర్పించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో DMG నాగార్జున, మండల సమాఖ్య ప్రతినిధులు, పులివెందుల డివిజన్ పరిధిలోని విత్త సఖీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.