Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తిరుమల లడ్డూలు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు : పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్ధానం ప్రాంగణంలో సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 300 మందికి తిరుమల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది.
  • ఈ సందర్భంగా వాసవి క్లబ్ మండల అధ్యక్షులు వడ్లపూటి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ తో దేశం అతలాకుతలం అయ్యిందని లాక్ డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తుంటే వాసవి క్లబ్ తరపు నుంచి నిరుపేదలకు అన్నదానం , మజ్జిగ ప్యాకెట్లు , శ్యానిటైజర్లు…
  • ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు రాచపూటి వెంకట రమణయ్య , పొట్టి సుధాకర్ , చెంచయ్య , ఆకులూరు విజయ్ , ఆకులూరు మధు ,కృష్ణం వెంకటరమణయ్య , అనిశెట్టి వెంకటేశ్వర్లు , ప్రభాకర్ , రవి , అమరా శివ , దేవస్ధానం కమిటి…

పొదలకూరు  : పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్ధానం ప్రాంగణంలో సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 300 మందికి తిరుమల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మండల అధ్యక్షులు వడ్లపూటి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ తో దేశం అతలాకుతలం అయ్యిందని లాక్ డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తుంటే వాసవి క్లబ్ తరపు నుంచి నిరుపేదలకు అన్నదానం , మజ్జిగ ప్యాకెట్లు , శ్యానిటైజర్లు , మాస్కులు పంపిణి చేశామని తెలిపారు.అందులో భాగంగా నేడు తిరుమల తిరుపతి దేవస్ధానం లడ్డూలను 300 మందికి ఉచితంగా పంపిణి చేశామని తెలిపారు.అంతే కాకుండా రానున్న రోజుల్లో మా క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవకార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు రాచపూటి వెంకట రమణయ్య , పొట్టి సుధాకర్ , చెంచయ్య , ఆకులూరు విజయ్ , ఆకులూరు మధు ,కృష్ణం వెంకటరమణయ్య , అనిశెట్టి వెంకటేశ్వర్లు , ప్రభాకర్ , రవి , అమరా శివ , దేవస్ధానం కమిటి సభ్యులు సన్నికంటి శ్రీనయ్య , శ్యామ్ , చొప్పా వెంకటేశ్వర్లు , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *