ఉదయగిరి మండలం కొండకింద గ్రామమైన లింగంనేనిపల్లెలో వినాయక చవితి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. గ్రామ యువత, ప్రజలు కలిసి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. పూజా కార్యక్రమాలకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. యువత ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు చేపట్టగా, గ్రామస్థులు సహకరించారు. వినాయక నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

లింగంనేనిపల్లెలో ఘనంగా వినాయక పూజలు