Sunday, 12 July 2026
  • Home  
  • రౌడీ షీటర్లకు ఎస్సై హానీఫ్ హెచ్చరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రౌడీ షీటర్లకు ఎస్సై హానీఫ్ హెచ్చరిక

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 12 (పున్నమి ప్రతినిధి) మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీ షీటర్లకు ఎస్సై మహమ్మద్ హానీఫ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, అల్లర్లు, అలజడులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నమోదైన ప్రతి రౌడీ షీటర్ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో క్రమం తప్పకుండా సంతకాలు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు స్టేషన్ అధికారికి సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 12 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీ షీటర్లకు ఎస్సై మహమ్మద్ హానీఫ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, అల్లర్లు, అలజడులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నమోదైన ప్రతి రౌడీ షీటర్ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో క్రమం తప్పకుండా సంతకాలు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు స్టేషన్ అధికారికి సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.