రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం
పలమనేరు జూన్3,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం గంగవరం పంచాయతీ పరిధిలో గల కుర్నిపల్లి గ్రామం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు వర్షాలకు రోడ్డుపైకి పడిపోయాయి. గంగవరం పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ గ్రామీణ రహదారిల రహదారిలో కుర్నిపల్లి, చీళ్ళవారి పల్లి,ఒడ్డిఇండ్లు, ఉయ్యాల మిట్ట, తమ్మిరెడ్డి పల్లి, తాళ్లపల్లి ఏడురు,దండపల్లి పాటు ఇంకా పలు గ్రామాలు ఉన్నాయి. ఈ రహదారిపై ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు, రైతులు వెళ్తుంటారు అలాగే ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు, లారీలు, బస్సులు కూడా వెళుతుంటాయి పది గ్రామాల ప్రజలు ఈ రహదరిలోనే ప్రయాణిస్తుంటారు. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది ఇలాంటి రహదారిలో వర్షాలకు రోడ్డుపై పడిపోయిన ముళ్ల పొదలను తొలగించాలని వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. ముళ్ళ పొదలు రోడ్డుపై పడిపోవడంతో దారి కనిపించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన ముళ్ళ పొదలు తొలగించాలని పలువురు కోరుతున్నారు.
రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం
రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం పలమనేరు జూన్3,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం గంగవరం పంచాయతీ పరిధిలో గల కుర్నిపల్లి గ్రామం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు వర్షాలకు రోడ్డుపైకి పడిపోయాయి. గంగవరం పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ గ్రామీణ రహదారిల రహదారిలో కుర్నిపల్లి, చీళ్ళవారి పల్లి,ఒడ్డిఇండ్లు, ఉయ్యాల మిట్ట, తమ్మిరెడ్డి పల్లి, తాళ్లపల్లి ఏడురు,దండపల్లి పాటు ఇంకా పలు గ్రామాలు ఉన్నాయి. ఈ రహదారిపై ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు, రైతులు వెళ్తుంటారు అలాగే ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు, లారీలు, బస్సులు కూడా వెళుతుంటాయి పది గ్రామాల ప్రజలు ఈ రహదరిలోనే ప్రయాణిస్తుంటారు. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది ఇలాంటి రహదారిలో వర్షాలకు రోడ్డుపై పడిపోయిన ముళ్ల పొదలను తొలగించాలని వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. ముళ్ళ పొదలు రోడ్డుపై పడిపోవడంతో దారి కనిపించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన ముళ్ళ పొదలు తొలగించాలని పలువురు కోరుతున్నారు.